కె.శ్రీనివాసరావు నేడు పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎస్పీ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ, చరిత్రాత్మకమైన పల్నాడు జిల్లాకు రావడం సంతోషమని ఇటీవల కొన్ని ఘటనల కారణంగా పల్నాడులో శాంతిభద్రతలు అదుపు తప్పాయని అన్నారు. ముఖ్యంగా జిల్లాలో మహిళలకు రక్షణ కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, యాంటీ డ్రగ్స్ పై జిల్లాలో 100 రోజులు క్యాంపెన్ చేస్తామని , గంజాయి విక్రయాలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఏ సమస్యలు ఉన్నా ప్రజలు తమ వద్దకు వచ్చి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.