తిరుపతి జిల్లా పాకాల మండలం పేరసానిపల‌్లి పంచాయతీలో మహ‌్మద్ పుర్ (తుర్కపల్లి)లో ముస‌్లీంలు నిర్వహించిన మొహరం వేడుకలలో సోమవారం రాత్రి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. ఎమ్మెల్యేకి గ్రామస్తులు ముస్లిం సాంప్రదాయంలో శాలువా కప్పి టోపీ ధరింపజేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ మోహరం త‌్యాగాలకు ప‌్రతీకగా జరుపుకుంటారని, అదేవిధంగా మతాలకు అతీతంగా మొహరం జరుపుకుంటారన్నారు. గత ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.