మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఈ రోజు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపినీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక మాట్లాడుతూ నేను ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి 80 కోట్ల రూపాయలు తీసుకువచ్చానని ఎమ్మెల్యే డాక్టర్.మురళీ నాయక్ మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను సుమారుగా 99 మంది లబ్ధిదారులకు 99 లక్షల 11 వేల 484 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుంది అని లబ్ధిదారులు ఎవ్వరూ ఉన్నా కచ్చితంగా విడుతల వారీగా వస్తాయని గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో సేద్యం చేయని, కొండలు,గుట్టలు,రియల్ ఎస్టేట్ భూములకు రైతు బంధు తీసుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ రైతుల నుంచి సలహాలు సూచనలు తీసుకొని రైతులకు లబ్ధి చేకూరే విధంగా రైతు భరోసా, ఇన్ ఫుట్ సబ్సిడీ,కౌలు రైతులకు రైతు బంధు తదితర విషయాల పై ఒక క్యాలెండర్ ను ఏర్పాటు చేసి , దాని ప్రకారం అందజేస్తామన్నారు.
వికలాంగులకు దసరా నుంచి పెంచిన పెన్షన్ ను అందజేస్తామని , నియోజకవర్గానికి 3500 ఇందిర ఇండ్ల ను పూరి గుడిసెల్లో నివసించే నిజమైన లబ్ధిదారులకు అందజేస్తామని ,వీటి తర్వాత మహిళలకు 2,500 కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం తదితర సంక్షేమ పథకాలను అందజేస్తామని అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఆర్టీసీ బస్ డిపోలో జనాభా రద్దీ కి అనుగుణంగా కావలసిన బస్సులను ఏర్పాటు చేస్తున్నామని, గృహజ్యోతి పథకంలో జీరో కరెంట్ బిల్లు రానివారు మండల పరిషత్ కార్యాలయం లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, వారందరికీ జీరో బిల్లు వస్తుందని తెలిపారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ఇరువై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, పలు వార్డుల కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సీపీఎం పార్టీ నాయకులు, యూత్ నాయకులు, వివిధ విభాగాల నాయకులు కాంగ్రెస్ పార్టీ అనుసంధా పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళా మణులు లబ్ధిదారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.