హైదరాబాద్ / పఠాన్ చేరు : శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పఠాన్ చేరు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని పలువురు కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా.. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు డోకూరి రామ్మోహన్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు బాబు, అతీక్ తదితరులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సమిష్టి కృషితో ఇటు పార్టీని అటు పటాన్చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్దామని ఎమ్మెల్యే జిఎంఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నగేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.