తిరుపతి జిల్లా, పాకాల మండలం స్థానిక పోలీస్ స్టేషన్లో తిరుపతి డిఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తిరుపతి డిఎస్పి నరసింగప్ప మాట్లాడుతూ గత నెల 16వ తేదీన నేండ్రగుంట వద్ద ఒంటరిగా ఉన్న మహిళ మెడలో కొంతమంది వ్యక్తులు బంగారు తాళిబొట్టును లాక్కోని వెళ్లారని, అక్కడే ఉన్న కొంతమంది ప్రజలు వారిని వెంటపడడంతో దొంగలు వాళ్ల దగ్గర ఉన్నటువంటి బైక్ లను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారన్నారు. ఈ కేసును ఎలాగైనా పట్టాలని వివిధ కోణాల్లో ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో మంగళవారం సాయంకాలం నాలుగు గంటలకు నేండ్రగుంట హైవే ఫ్లైఓవర్ కింద వాహనాలను తనిఖీలు చేస్తుండగా రెండు మోటార్ సైకిల్ లో నలుగురు వ్యక్తులు పోలీస్ వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేస్తూండగా వాళ్లని పోలీసులు పట్టుకొని విచారిస్తే వాళ్లు గతంలో చేసినటువంటి నేరాలు అంటే గత నెలలో 16 తేదీన నేండ్రగుంటలో మహిళా మెడలో లాక్ వెళ్ళినటువంటి బంగారు తాళిబొట్టు మరియు పెనుమురు, పూతలపట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో ను ఇదేవిధంగా చేసినటువంటి దొంగతనాలు తర్వాత తవణంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే విధంగా పగలే దొంగతనం చేసినటువంటి వివిధ రకాల చిన్నచిన్న ఆభరణాలు వీరిని అరెస్ట్ చేసి విరి వద్ద నుంచి సుమారు 87 గ్రాములు బంగారం అంటే సుమారు 5 లక్షల విలువ చేసే వివిధ బంగారు ఆభరణాలు వారు దొంగతనానికి ఉపయోగించినటువంటి మూడు మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నామని డిఎస్పి తెలిపారు. ఈ దొంగతనం చేసినటువంటి ముద్దాయిలు మొదట వ్యక్తి మురళి, ఇతను ఊరు వావిళ్ళ తోట ఇతని బ్రదర్ బాబు, ఇతను ఇతని బ్రదరు వీళ్లది గతంలో కూడా నేర చరిత్ర ఉందని వీలపై తిరుపతి సీసీఎస్ లో కేసులు కూడా ఉన్నాయన్నారు. బాబు అనే వ్యక్తి చిన్న పిల్లల కోర్టులో కూడా బాల నేరస్తుల కోర్టులో కూడా కేసులు విచారించడం జరిగిందన్నారు. తర్వాత హర్షవర్ధన్ రాజు ఇతనిది మఠంపల్లి, పెనుమూరు మండలం వరుణ్ కుమార్ భాస్కరపురం, పెనుమూరు మండలం ఈ నలుగురు కూడా చిన్న చిన్న దొంగతనాలు మరియు ఒంటరిగా పోతున్నటువంటి మహిళల మెడలో చైన్లు లాకుపోవడం అటువంటి నేరాలను చేస్తున్నారన్నారు. అటువంటి వారిని పట్టుకొని బంగారు ఆభరణాలు మరియు మూడు మోటార్ బైక్ లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించినటువంటి సిఐ శ్రీరాములు, ఎస్ఐలు మహేష్ బాబు, లోకేష్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు అభినందించడం జరిగిందన్నారు.