సంగారెడ్డి , పఠాన్ చేరు : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వైద్య, ఆరోగ్యం అంశాల్లో కీలక భూమిక పోషిస్తున్న ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పఠాన్ చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవడంతో పాటు, వారి డిమాండ్ల పరిష్కారానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.