- ఐదేళ్ల వైసీపీలో లక్ష 75 వేల ఎకరాలు, రూ.35,576 కోట్లు విలువ ఉన్న భూములు ఆక్రమణలు జరిగాయి.
– పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. - ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో భూదందాలు, సహజవనరుల దోపిడీ తప్పా ఏమి లేదు.
- గత పాలనలో ప్రభుత్వ, ప్రజాధనాలను జగన్ మోహన్ రెడ్డి తాత జాగీరులా అక్రమాలకు పాల్పడ్డారు.
- జగన్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు, దోపిడీలపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి.
- ప్రజలకు జగన్ ఆయన మంత్రివర్గం చేసిన అవినీతిని తెలుపాలనే మా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసారు.
- వైసీపీ ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమాలకు బయటకు తీస్తాం.
గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ .. వైసిపి ఐదేళ్ల పాలనలో భూదందాలు, సహజవనరుల దోపిడీ తప్ప ఏమీ జరగలేదని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు, దోపిడీలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేసిందని. వైసీపీ పాలకులు ఏ విధంగా అక్రమాలు, దందాలు చేశారో, ఏంత దోచుకున్నారో ఆధారాలతో సహా శ్వేతపత్రాల ద్వారా బయటపెడుతున్నామన్నారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో దాదాపు 1.75 లక్షల ఎకరాల భూ ఆక్రమణలు జరిగాయని వాటి విలువ రూ.35,576 కోట్లు పైనేనని, ఇళ్ల పట్టాల పేరుతో 10 వేల ఎకరాలు, ఇసుక దందాలో రూ.9,750 కోట్ల వైసీపీ నాయకులు దోచుకున్నారని మండిపడ్డారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీ నేతలు భూదోపిడీకి పాల్పడ్డారున్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో: 512ను రద్దు చేయడం జరిగిందన్నారు తెలియజేశారు. ప్రైవేటు వ్యక్తిని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ గా నియమించి పేద ప్రజల భూములను కొట్టేయాలని పన్నాగం పన్నారన్నారు.
ఇంతటి ప్రమాదకరమైన చట్టాన్ని దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం అమలు చేయలేదు కానీ నల్ల చట్టంలోని లొసుగులను గ్రహించిన జగన్ రెడ్డి ప్రభుత్వం జీవో 512ను జారీ చేసి అక్రమాలను సక్రమంగా మార్చే ఆయుధంగా నల్లచట్టాన్ని వాడుకున్నారన్నారు తీవ్ర విమర్శలు చేశారు . సొంతవారి కోసం రికార్డులు సృష్టించే ఎత్తుగడను జగన్ రెడ్డి పన్నారన్నారు.
తక్కువ ధరకు రైతుల నుంచి భూములను కొనుగోలు చేసి ఎక్కువ ధరకు ప్రభుత్వానికి ఇళ్ల స్థలాల కోసం అమ్మిన వైసీపీ నేతల భాగోతాల గురించి సాక్షాధారాలతో సహా శ్వేతపత్రంలో పొందుపరచడం జరిగిందని స్పష్టం చేశారు.
ఇళ్ల పట్టాల ముసుగులో వైసీపీ నేతలు ప్రజాధనాన్ని కొల్లగొట్టారని వీరి దగ్గర నుంచి ప్రతీ రూపాయి వసూలు చేసి ప్రజా ఖజానాకు జమ కడతామని వెల్లడించారు.
విశాఖలో రామానాయుడు స్టూడియో భూములు, వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయగ్రీవ భూములను రేణుగుంటలోని మఠం భూములను, పుంగనూరులో 982 ఎకరాలను కూడా కొట్టేశారని, దస్పల్లా కొట్టేసి ఇళ్లు కట్టి అవినీతికి పాల్పడ్డారన్నారు.
విశాఖలో రామానాయుడు స్టూడియో భూములు, వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయగ్రీవ భూములను, తిరుపతి, రేణుగుంటలోని మఠం భూములను, పుంగనూరులో 982 ఎకరాలను కూడా కొట్టేసారని . దస్పల్లా భూములను కొట్టేసి ఇళ్లు కట్టారని పేర్కొన్నారు.
చిత్తూరులో 782 ఎకరాలు, ఒంగోలులో నకిలీ పత్రాలతో రూ.101 కోట్లల ఆస్తి కాజేసేందుకు యత్నించారన్నారు. వీటిపై విచారణ చేపట్టామన్నారు. 13,800 ఎకరాల ఆవ భూములను వైసీపీ నేతలకు ధారాదత్తం చేశారని. తక్కువ ధరకు 40 వేల ఎకరాలు కొన్నారని అధికారులను బెదిరించి భూములకు పట్టాలు తెచ్చుకుని వాటిలో భవనాలు కట్టుకున్నారన్నారు.
రుషికొండలో రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టి ప్రజా ధనాన్ని వృధా చేశారన్నారు. భూహక్కు పత్రం పేరుతో ప్రచారానికి రూ.13 కోట్లు ఖర్చు చేశారు. భూముల రీసర్వే పేరుతో పాస్ బుక్ లపై జగన్ చిత్రం ముద్రించుకున్నారని విమర్శలు చేశారు.
వైసీపీ జిల్లా కార్యాలయాల కోసం రెండేసి ఎకరాలను నామమాత్రపు రుసుముతో 33 ఏళ్ల లీజుకు ఇచ్చుకున్నారని మొత్తం రూ.3 వందల కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టారని కొండలను సైతం జగన్ రెడ్డి ప్రభుత్వం అనకొండల్లా మింగేసి గుండులు కొట్టేశారని ఇష్టాచారంగా నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ఎమ్మెల్యేలే అక్రమంగా భూగర్భవనరులను తొవ్వేశారన్నారు.
వైసీపీ నేతలు ఇసుకాసురల అవతారాలెత్తి ఇసుకను మింగేశారని, వందలాది టిప్పర్ల ఇసుక అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి నూతన ఇసుక విధానం పేరుతో భవన నిర్మాణ రంగాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం కుప్ప కూలిందని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను సైతం వైసీపీ నాయకులు వదిలి పెట్టలేదని దోచుకున్నారని మండిపడ్డారు.
గృహ నిర్మాణ శాఖకు సరఫరాల పేరుతో 98 లక్షల టన్నుల ఇసుకను వైసీపీ నాయకులు మింగేశారని, జేపి వెంచర్స్ చెల్లించాల్సిన మోత్తం నుంచి రూ.800 కోట్లు మినహాయించారన్నారు , మింగేసిన ఇసుకతో దాదాపు పది లక్షలకు పైగా ఇళ్లు కట్టుకోవచ్చని. ప్రజా ప్రభుత్వంలో నియోజకవర్గంలో అందరికీ సంక్షేమ పథకాలు అందించి. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు….