అంతరపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం వీరన్న పల్లి గ్రామానికి చెందిన రెడ్డప్ప పొలంలో కొందరు వైసిపి మూకలు సుమారు 150 మామిడి చెట్లను నరికినట్లు బాధితుడు ఆరోపిస్తన్నాడు. మూడేళ్ల క్రితం రాజమండ్రి నుండి మామిడిలో కొత్త రకాలైన కేసరి మల్లిక మామిడి మొక్కలను కొనుగోలు చేసి సుమారు రెండెకరాల్లో నాటానని, నిన్న రాత్రి వైసిపి పార్టీకి చెందిన కొందరు సుమారు 4 లక్షల విలువ చేసే మొక్కలు నరికేశారని రెడ్డప్ప ఆవేదన చెందాడు. పోలీసువారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.