హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని బీఎస్సీ స్టాటిస్టిక్స్ విద్యార్థిని రీతి దత్తా చౌధురి ఎమ్మెస్సీలో ప్రవేశం కోసం నిర్వహించిన ఐంటీ జాయింట్ అడ్మిషన్ టెస్ట్లో 333 అఖిల భారత ర్యాంక్ సాధించింది. దీనితోపాటు, సీయూఈటీ పీజీ పరీక్షలో కూడా ఆమె ప్రతిభ కనబరిచి, మనదేశంలోని అనేక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో ప్రవేశానికి మార్గం సుగమం చేసింది.
రీతి యొక్క అత్యుత్తమ ప్రదర్శన హైదరాబాద్ విశ్వవిద్యాలయం (15వ ర్యాంకు), బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, పాండిచ్చేరి విశ్వవిద్యాలయం (10వ ర్యాంకు), తమిళనాడులోని కేంద్రీయ విశ్వవిద్యాలయం (1వ) ర్యాంకు)తో సహా అగ్రశ్రేణి సంస్థలలో ఆమెకు సీట్లను సంపాదించి పెట్టింది. ఇది ఆమె విద్యా నైపుణ్యాన్ని ఎత్తిచూపడమే గాక, స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణితశాస్త్ర విభాగం అందిస్తున్న అత్యుత్తము విద్యకు కూడా నిదర్శనంగా నిలుస్తోంది.
గీతం విశ్వవిద్యాలయంలోని అధ్యాపకుల నుంచి తనకు లభించిన అమూల్య ముద్దతు, మార్గదర్శకత్వానికి రీతి దత్తా కృతజ్ఞతలు తెలియజేశారు. ‘నా’ ఆధ్యాపకుల తిరుగులేని ముద్దతు, మార్గదర్శనం లేకుండా ఈ విజయం సాధ్యం కాదు. వారి అంకితభావం, ప్రోత్సాహం నా విద్యా ప్రయాణానికి మూలస్తంభంగా ఉన్నాయి. నా లక్ష్యాల కోసం శ్రద్ధగా పనిచేయడానికి నాకు శక్తినిస్తాయి’ అని ఆమె పేర్కొన్నారు. మంచి ర్యాంకు సాధించిన రీతి దత్తాను గీతం. ఉన్నతాధికారులు, అధ్యాపకులు, సహచర విద్యార్థులు ప్రశసించారు.