మదనపల్లి : తెలుగుదేశం పార్టీ పాలయేకరి సాధికార సమితి స్టేట్ కమిటీ డైరెక్టర్ రఘుపతి నాయుడు జన్మదిన వేడుకలు శుక్రవారం మదనపల్లి లో ఘనంగా జరిగాయి. ఉదయం స్థానిక శాసనసభ్యుడు షాజహాన్ భాష ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపగా, అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన నివాసం వద్ద కలుసుకొని పూలమాలలతో వేసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా రఘుపతి నాయుడు మాట్లాడుతూ.. తన పుట్టినరోజు సందర్భంగా అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ శక్తి వంచన లేకుండా పనిచేస్తానని అన్నారు.