పల్నాడు జిల్లా, గురుజాల : శుక్రవారం ఉదయం పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గురజాల రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో వస్తున్న భూ సమస్యలు మరియు రెవెన్యూ సంబంధించిన సమస్యలు గురించి వివరాలు సేకరించారు. అదేవిధంగా ఎంతమంది రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సిబ్బంది పనిచేస్తున్నారు వారి వివరాలని సేకరించారు. అనంతరం రెవిన్యూ డివిజనల్ అధికారి కి పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గురజాల రెవెన్యూ డివిజన్ అధికారి రమాకాంత్ రెడ్డి మరియు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలిసారిగా గురజాల రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబును రెవెన్యూ డివిజన్ అధికారి రమణ కాంత్ రెడ్డి సాదరంగా కార్యాలయానికి ఆహ్వానించారు.