రామసముద్రం: మండలoలోని శీతరగానిపల్లె గ్రామానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవతో రోడ్డుకు మరమ్మతు పనులను ప్రారoభమయ్యాయి. శనివారం టిడిపి మండలాధ్యక్షులు విజయకుమార్ గౌడు రోడ్డుకు భూమిపూజ చేసి, ఎక్స్ కవేటర్ తో పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా మండల పర్యటన సందర్బంగా సీతరగానిపల్లి గ్రామస్తులు రోడ్డు మంజూరు చేయాలని తన దృష్టికి తీసుకు రాగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే మంజూరు చేయిస్తానని మాట ఇవ్వడం జరిగిందన్నారు. మాట ఇచ్చిన వారం రోజుల్లోనే మండల పరిషత్ నిధులు రూ. 4లక్షలు మంజూరు చేయించారని తెలిపారు. ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న రోడ్డుకు నిధులు మంజూరవ్వడంతో గ్రామస్థులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా, విజయ్ కుమార్ గౌడ్, సర్పంచ్ కవితమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యాక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.