- వికారాబాద్ జిల్లాలో దొంగనోట్ల ముఠా అరెస్ట్ .. రూ.7.95 లక్షలు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి
వికారాబాద్ జిల్లా లో దొంగనోట్ల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద 7.95 లక్షల నకిలీ 500 నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పోలీసులు వచ్చిన సమాచారం మేరకు తాండూరు పట్టణం అయ్యప్ప కాలనీకి చెందిన చంద్రప్ప వద్ద తనిఖీలు చేయగా ఆయన వద్ద రూ. 45 వేల నకిలీ 500 నోట్లు లభ్యమయ్యాయని ఆయనను విచారించగా మరో ముగ్గరు జగదీశ్, వెంకటరమణ, శివకుమార్ లు ఈ ముఠాలో ఉన్నారని తెలుపడంతో హైదరాబాద్ లో ఓ ఆపార్టమెంట్ లో నివాసం ఉంటున్న వారిని పట్టుకోగా వారి వద్ద రూ. 7.50 లక్షలు, సీపీయూ, ప్రింటర్, పేపర్లు, మానిటర్, రిబ్బన్, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నింధితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. హైదరాబాద్ లో పట్టుకున్న నింధితులపై గతంలో కొన్ని పోలీస్ స్టేషన్ లలో నేర చరిత్ర ఉందని, డబ్బులు ఎక్కడ ఎక్కడ బయట మార్కెట్ లోకి పంపించారనే విచారణలో తెలుసుకుంటామని తెలిపారు. దొంగ నోట్ల ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి, సీఐ సంతోష్ కుమార్, ఎస్ ఐ లు రాములు, పోలీసు సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేశారు.