హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 15వ పట్టభద్రుల దినోత్సవాన్ని శనివారం ఘనంగా జరుపుకుంది. విభిన్న విద్యా విభాగాలకు చెందిన 1,490 మందికి విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ బ్యాంకింగ్ వ్యూహకర్త, బార్క్లేస్ బ్యాంక్ ఇండియా పూర్వ ముఖ్య కార్యనిర్వహణాధికారి రామ్ గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
వేగంగా మారుతున్న సాంకేతికత, సుస్థిరతపై అనగాహన పెంపొందించే ఈ యుగంలో, మనం దృష్టిని బాభాపేక్ష నుంచి ప్రభావం నెప్పుడు మరల్పాలని ఆయన ఉద్బోధించారు. పోటీ కంటే సహకారం ద్వారా విలునను సృష్టించడం, ఆదేశం కంటే సమన్వయంతో విధులు నిర్వహించడం బాధ్యతాయుతంగా ఉంటుందన్నారు. నియంత్రణ నుంచి వేగవంతమైన అభ్యాసం, అనుసరణకు అనుగుణంగా పని పద్ధతులను అభివృద్ధి చేయడం తప్పనిసరని చెప్పారు. కేవలం వృత్తి నిపుణులుగా కాకుండా పరిపూర్ణ వ్యక్తులుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం మంచిదని హితవు పలికారు. కష్టపడి పనిచేయడం, కొత్త అనుభవాలను స్వీకరించడం, వైఫల్యం నుంచి నేర్పుకోవడం, అర్థవంతమైన సంబంధాలను పెంపొందించుకోవాలని పట్టభద్రులకు సూచించారు. తమ ప్రయాణంలో ఆనందాన్ని వెతుక్కోవడం, మన సమాజాన్ని సుసంపన్నం చేయడానికి తిరిగి ఇవ్వడాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని రామ్ గోపాల్ హిరబోధ చేశాడు.
సభాధ్యక్షత వహించిన ఇన్ఫ్ర్ఛార్జి ఉపకులపతి ప్రొఫెసర్ వై.గౌరమరావు మాట్లాడుతూ, సంపూర్ణ విద్య పట్ల గీతం అంకితభావాన్ని నొక్కిచెప్పారు. మేము 360 డిగ్రీల అభ్యాస అనుభవాన్ని పెంపొందించే విద్యార్థి- కేంద్రీకృత వాతావరణాన్ని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నాము. విద్యార్థులు తమ అభిరుచికి అనుగుణంగా అద్భుతమైన పరిశోధనలో పాల్గొనడానికి, గణనీయమైన ప్రభావాన్ని చూసే నిపుణులుగా తీర్చిదిద్దడంతో పాటు సమాజంలోని సానుకూల నూర్పును అందిపుచ్చుకోవాలనేది మా లక్ష్యం’ అన్నారు.
గీతం-హెదరాబాద్ వార్షిక నివేదికను అదనపు ఉపకులపతి (ప్రో వీసీ) ప్రొఫెసర్ డీ.ఎస్.రావు సమర్పించారు. గీతల హెదరాబాద్ దృ కృథం, సమాజంలో పట్టభద్రుల పాత్ర గురించి మాట్లాడుతూ, ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో కూడిన అసాధారణమైన జ్ఞాన ఆధారిత సంస్థగా గీతం విద్యా సంస్థను తీర్చిదిద్దడంపై దృష్టి, కేంద్రీకరించినట్టు చెప్పారు. ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆవిష్కరణ, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనల పట్ల నిబద్ధత తమ పట్టభద్రులను సమాజం వెపు నడిపించడానికి, అర్థవంతంగా అందించడానికి సన్నద్ధం చేస్తోందన్నారు. వారు ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు, తను భవిష్యత్తును రూపొందించుకునే బాధ్యత విద్యార్థులపెనై ఉందని, వారు ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదని ప్రొఫెసర్ డీ.ఎస్. రావు వ్యాఖ్యానించారు.
గీతం విశ్వవిద్యాలయం, హెదరాబాద్ 15వ స్నాతకోత్సవం అకడమిక్ ఎక్సలెన్స్, విద్యార్థుల సమగ్రాభివృద్ధికి సంస్థ యొక్క ఆచంచలమైన నిబద్ధతకు ఉదాహరణ, విభిన్న శ్రేణి విభాగాలు, అనువర్తిత అభ్యాసంపె దృష్టి, పరిశోధనకు ప్రాధాన్యతలు గీతం సట్టభద్రులను మార్పుకు అనుగుణంగా సన్నద్ధులయ్యేలా సిద్ధం చేస్తోందని, ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూసే భవిష్యత్తు నాయకులుగా వారిని తీర్చిదిద్దుతోందని చెప్పారు.
గీతం హైదరాబాద్ ప్రాంగణంలో 2023-24 విద్యా సంవత్సరంలో 1,490 మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, సైన్స్, ఫార్మసీ, హ్యుమానిటీస్ వంటి వివిధ విభాగాలలో డిగ్రీలు పొందడానికి అర్హత సాధించగా, 1,325 మంది విద్యార్థులు వ్యక్తిగతంగా హాజరై పట్టాలను స్వీకరించారు. అత్యుత్తను ప్రతిభ కనబరచిన 23 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకున్నారు. గీతం విద్యార్థులు నెత్తికత విషయంలో రాజీపడకుండా సమాజాభివృద్ధికి, దేశ ప్రగతికి కట్టుబడి ఉంటామని యూజీ బెస్ట్ ఆల్రౌండర్ వర్ల మెథైలి నిమ్మకాయల ప్రతిజ్ఞ వేయించగా, పట్టభద్రులందరి తరఫున సీజీ టెస్ట్ ఆల్ గ్రౌండర్ శినకుమార్ శరాంజలి గీతం భూజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గీతం రిజిస్ట్రార్ డాక్టర్ డి.గుణశేఖరన్ వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.
ఈ 15వ పట్టభద్రుల దినోత్సవంలో గీతం కార్యదర్శి ఎం. భరద్వాజ్, గీతం పాలక మండలి సభ్యుడు హంజు కె.మెహది ప్రాచీసీలు డాక్టర్ గీతాంజలి బత్మనాబానే (మెడికల్ సెన్సైస్), ప్రొఫెసర్ కెఎన్ఎస్ ఆచార్య; డీన్లు ప్రొఫెసర్ కె.శ్రీకృష్ణ (సెన్స్డ్), ప్రొఫెసర్ జగర్తరన్ దాస్ (ఫార్మసీ), ప్రొఫెసర్ కానుయ్య బండి (హ్యుమానిటీస్), డాక్టర్ విభూతి సన్దేవ్ (ఆర్కిటెక్చర్), ప్రొఫెసర్ రాజా ఫణి పప్పు (మేనేజ్మెంట్), సయ్యద్ అక్బరుద్దీన్ (కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ); పలువురు ఉన్నదాధికారులు, ఆధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు