పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ గా సూరజ్ గనోరే ధనంజయ్ ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన రంపచోడవరం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్టు అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. త్వరలో ఈయన పల్నాడు జిల్లాలో జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.