సంగారెడ్డి జిల్లా , అమీన్పూర్ : గురు పౌర్ణమి పురస్కరించుకొని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు కట్టపై గల సాయిబాబా దేవాలయంలో మున్సిపల్ చైర్మన్ టిపిఆర్ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్న ప్రసాదం వితరణ నిర్వహించారు. తదనంతరం.. 21 రోజుల సాయిబాబా దీక్షను విరమించారు. ఈ సందర్భంగా చైర్మన్ టి.పి.ఆర్ మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి తన జీవితాంతం గురువుతో అనుబంధం ఏర్పరచుకొని, వారి మార్గదర్శకత్వంలో ముందుకు వెళతారని తెలిపారు. ప్రతి ఏటా గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ టిపిఆర్ కుటుంబ సభ్యులు, పట్టణ పుర ప్రముఖులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.