పల్నాడు జిల్లా కారంపూడి గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు భారీ వర్షం లోను తమ విధులను నిర్వహిస్తున్నారు. గత వారం నుండి కారంపూడి పట్టణంలో డెంగ్యూ , మలేరియా వంటి వ్యాధిని పడినవారు ఉన్నారు. అందుకని అధికారులు ఆదేశానుసారం పారిశుధ్య కార్మికులు జోరు వానలోనూ కంప చెట్లను నరికి మురికి కాలువలను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
గత వైసిపి ప్రభుత్వంలో సంవత్సరానికి ఒకసారి కాలువలు పూడిక తీసిన పాపాన పోలేదు. ప్రజలు అధికారులకు ఫోన్ చేస్తే పంచాయతీలో నిధులు లేవనే సమాధానం ఉండేది. కానీ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి మండలంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అలాగే స్థానిక నాయకుల సహకారంతో అనేక అభివృధి పనులు జరుగుతున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జోరు వానలో పారిశుధ్య కార్మికుల చేస్తున్న సేవలకు స్థానిక ప్రజలు , నాయకులూ వారిని అభినందిస్ళ్తున్నారు.
పంచాయతీ లో గత 15 సమస్తరులాగా పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు రోజువారి కూలీలుగా పని చేస్తున్నారు. వారిని ప్రభుత్వం గుర్తించి సీనియారిటీ ప్రకారం రెగ్యులైజ్ చేయాలని కార్మికులు కోరుతున్నారు. అంతేకాక వారు చేస్తున్న సేవలను స్థానిక ప్రజలు గుర్తించి వారికి సహకరించాలని కార్మికులు కోరుతున్నారు.