సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని బేగంపేట్ గ్రామంలో ఫలహారం బండి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఏదులకంటి మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు అమీన్‌పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నర్సింహాగౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ నందారం నర్సింహాగౌడ్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఆధునిక జీవితంలో ఆధ్యాత్మిక చింతన ప్రతిఒక్కరికీ అవసరమన్నారు. ఫలహారం బండి ఊరేగింపు ఆనాదిగా వస్తున్న సంప్రదాయమని, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం మనందరి పైనా ఉందని చెప్పారు. ఇంత అద్బుతంగా ఫలహారం బండి ఊరేగింపును నిర్వహించిన మహేష్ గౌడ్‌ను అభినందించారు. కార్యక్రమంలో కె.రామక్రిష్ణారెడ్డి, పర్వతా చారి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.