ఈరోజు ఉదయం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 39 మంది ఫిర్యాదుదారులు హాజరై తమ సమస్యలను జిల్లా ఎస్పీ కి స్వయంగా తెలియచేసుకున్నారు. ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, సంబంధిత పోలీస్ అధికారులతో నేరుగా మాట్లాడి, సకాలంలో సమస్యలు పరిష్కరించవలసిందిగా ఆదేశాలు, సూచనలు ఇచ్చారు.
జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లలోను, సర్కిల్ కార్యాలయాలలోను, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చునని, ఆ ఫిర్యాదులను ప్రజా సమస్య పరిష్కార వేదిక ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో సత్వర న్యాయం చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.