ప్రకాశం జిల్లా: దొనకొండలోని విమానాశ్రయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడంతో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. తమీమ్ అన్సారియా, మంగళవారం దొనకొండలోని విమానాశ్రయ ప్రదేశాన్ని పరిశీలించారు. విమానాశ్రయానికి ఎన్ని ఎకరాల భూమి అవసరం ఉంది, ఎంత భూమిని ప్రతిపాదించారు, అందులో ఏమైనా ఆక్రమణలు ఉన్నాయా అని జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. విమానాశ్రయానికి ప్రతిపాదించిన భూములకు సంబంధించిన వివరాలను మ్యాపుల ద్వారా ఆర్డీఓ జాన్ ఇర్విన్, జిల్లా కలెక్టర్ కు వివరించారు. దొనకొండ విమానాశ్రయ పూర్తి సమాచారంను క్లుపంగా నివేదికను సిద్ధంచేసి అందజేయాలని జిల్లా కలెక్టర్, ఆర్డీవో ను ఆదేశించారు.