ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు అర్బన్ కాలనీకి వెళ్లే రోడ్డు బురదమయంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు విస్తరంగా కురవడంతో రోడ్డు పూర్తిగా బురదగా మారుతుంది. దీనిపై రాకపోకలు సాగించే ప్రజాలు అవస్థలు పడుతున్నారు. దీనిపై గత ప్రభుత్వా ప్రజా ప్రతినిధులు, అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా నాయకులు , అధికారులు స్పందించి కాలనీకి సిమెంట్ రోడ్లు మంజూరు చేయాలనీ స్థానికులు కోరుతున్నారు.