కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కస్తూరిబా పాఠశాలలో గత కొన్ని రోజులుగా పాఠశాలలో వంట సిబ్బంది మధ్య గొడవలు జరుగుతుందటంతో అక్కడ వంట సరిగ్గ చేయడం లేదని, మొన్నటి రోజు రాత్రి విద్యార్థులకు అన్నం పెట్టలేదని, ఉదయం టిఫిన్ కూడా లేటుగా పెట్టారని విద్యార్థుల సమస్యల పై నిన్న రిపోర్టర్ టీవీ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఈ రోజు ఉదయం కెజిబివి అసిస్టెంట్ డైరెక్టర్ శ్యాముల్ పాల్ పాఠశాలను తనిఖీ చేసి, అక్కడి సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంట గదిలో పాడైపోయి ఉన్న కాయగూరలను చూసిన వంట సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ మాకు సరైన ఆహారం పెట్టడం లేదని, ఉడకని అన్నం పెట్టడంతో అనారోగ్య సమస్యలు రావడం, ప్రతి రోజు ఆకలితో అల్లాడి పోతున్నామని కంటతడి పెట్టారు. తమకు మెనూ ప్రకారం సరైన ఆహారం పెట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని , అంతేకాక ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం శ్యామల్ పాల్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో జరుగుతున్న సమస్యలపై విద్యార్థులను, సిబ్బంది ని అడిగి తెలుసుకున్నానని, ఈ విషయాలపై నివేదిక రూపొందించి జిల్లా కలెక్టర్ కు అందిస్తామని తెలిపారు.