contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఉత్తరప్రదేశ్ లో మనీషా వాల్మీకి పై జరిగిన హత్యాచార సంఘటన ను నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీ

 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం  మండలంలోని  ఖాసింపెట గ్రామంలో  బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు 

ఉత్తరప్రదేశ్ లో  మనీషా వాల్మీకి పై జరిగిన అమానవీయ హత్యాచార సంఘటన ను నిరసిస్తూ శుక్రవారం  అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా  అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు జెరిపోతుల మహేందర్ మాట్లాడుతూ

సంఘటనకు కారణమైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జంతువులకు ఉన్న రక్షణ మనుషులకు లేదా అని కేంద్ర ప్రభుత్వంను ప్రశ్నించడం జరిగింది. తదనంతరం కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు, యువతి సామూహిక అత్యాచారానికి గురై,గాయాల కారణంగా మృతి చెందిన ఘటనను తీవ్రంగా ఖండించారు.  యువతిపై  రెండు వారాల క్రితం నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆమెను తీవ్రంగా హింసించి, నాలుక ను కోసి గాయపర్చారని. దాంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ప్రాణాలు విడిచిందని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు మునిగంటి సంతోష్ మాట్లాడుతూ ఈ రేపిస్టులను వెంటనే బహిరంగంగా ఉరితీయాలి.వారికి సహాయపడిన వారిని శిక్షించాలని.అని అన్నారు.. నగునూరి అనిల్ కుమార్ తన పాటతో మరణించిన మనీషా గారికి నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమంలో నగునూరి మధు బాబు, సురేందర్, నాయి బ్రాహ్మణ సేవా సమితి నాయకులు గర్శకుర్తి రమేష్ హరీష్, మునిగంటీ సాయి కృష్ణ, వంశీ, బండి కృష్ణ , దేశరాజు అనిల్, బత్తుల రాజు, సదాల నవీన్, కోటి . పలువురు మానవతావాదులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :