తిరుపతి జిల్లా పాకాల మండలంలో భారతీయ జనతా పార్టీ చంద్రగిరి ఇంచార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పురుషోత్తమ నాయుడు మాట్లాడుతూ గతంలో పాకాల బొమ్మాయిగుంట నుంచి బాలాజీ నగర్, గుట్ట కింద ఇండ్లు, రాజీవ్ కాలనీ, కరీంతుల్లాబాద్, శ్రీనివాసపురంకు వాటర్ సప్లై పైప్ లైన్ రైల్వే వారి ప్రాంతం నుండి వెళ్లవలసి ఉన్నది. దీనికోసం పర్మిషన్ కి గత ప్రభుత్వ నాయకులు మూడు సంవత్సరాలుగా ప్రయత్నం చేసారని అయినా రైల్వే పర్మిషన్ రాలేదని. ఈ సమస్యకు సంబంధించి రైల్వే వారి నుండి అనుమతిని ఇప్పించవలసిందిగా తమరిని పాకాల సర్పంచ్ కోరడం జరిగిందన్నారు. పంచాయతీ ప్రజల త్రాగునీటి అవసరాన్ని గుర్తించి వెంటనే నేను రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విన్ వైష్ణవ్ దృష్టికి తీసుకు వెళ్లనన్నారు. మంత్రి వెంటనే స్పందించి సత్వరమే అనుమతి మంజూరు చేయవలసిందిగా రైల్వే బోర్డును ఆదేశించడం జరిగిందన్నారు. ఎన్.డి.ఏ కూటమి తరపున కేంద్ర రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ గారికి ధన్యవాదాలు చేసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో పాకాల సర్పంచ్ కస్తూరి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు వెంకటాద్రి నాయుడు, తెలుగుదేశం మండల ప్రధాన కార్యదర్శి ఫల్గుణ, జనసేన మండల అధ్యక్షులు గురునాథ్, బిజెపి మండల నాయకులు నరేంద్ర, గౌతమి, సురేష్, నవీన్ రెడ్డి పాల్గొన్నారు.