- అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి
- బ్లూ క్రాస్ హైదరాబాద్ సెంటర్ ను సందర్శించిన మున్సిపల్ చైర్మన్, కమిషనర్
సంగారెడ్డి , అమీన్ పూర్ : అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో వీధి కుక్కల సంరక్షణ, కట్టడికి బ్లూ క్రాస్ హైదరాబాద్ సంస్థ సహకారంతో ముందుకు వెళ్తున్నామని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లోని బ్లూ క్రాస్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుక్కల సంరక్షణ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డితో కలిసి మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు, జంతు ప్రేమికురాలు అమలతో వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం, గాయపడ్డ కుక్కలకు చికిత్స, స్టెరిలైజేషన్, సంరక్షణ, తదితర అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల పైన సంస్థ బాధ్యులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ పరిధిలో వీధి కుక్కల కట్టడికి ఇప్పటికే చర్యలు చేపట్టామని చైర్మన్ టిపిఆర్ తెలిపారు. రాబోయే రోజుల్లో బ్లూ క్రాస్ హైదరాబాద్ సంస్థ సహకారంతో వీధి కుక్కల సంరక్షణకు చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపారు.