హైదరాబాద్ నగరంలో మరో వైరస్ విజృంభిస్తోంది. వేగంగా వ్యాపించే నోరో వైరస్‌పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ నగరవాసులను అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా జీహెచ్ఎంసీ పలు సూచనలు జారీ చేసింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భాగ్యనగరవాసులకు సూచనలు చేసింది.
‘నోరో వైరస్ వ్యాధితో జాగ్రత్త!! కలుషిత నీరు, ఆహారం కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.’ అని పేర్కొంది. చలిజ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ ఈ నోరో వైరస్ లక్షణాలు అని పేర్కొంది. ప్రస్తుతం నోరో వైరస్ కేసులు నగరంలోని యాకుత్‌పురా, మలక్ పేట, డబీర్‌పురా, పురానాహవేలీ, మొఘల్‌పురలతో పాటు పలు ప్రాంతాల్లో నమోదయ్యాయి. నోరో వైరస్ బారిన పడినవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలి.
- కాచి చల్లార్చిన, వడపోసిన నీటిని తాగాలి.
- ఇంటిని, పరిసరాలను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలి.