- గూడెం విష్ణువర్ధన్ రెడ్డి వర్ధంతి పురస్కరించుకొని నందిగామలో రక్తదాన శిబిరం
- స్నేహితుడి వర్ధంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు.
సంగారెడ్డి , పఠాన్ చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా.. పటాన్చెరు మండలం నందిగామ గ్రామానికి చెందిన జిఎంఆర్ యువసేన సభ్యుడు రామిడి సాయి వంశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన జిఎంఆర్ యువసేన సభ్యులు, విష్ణు స్నేహితులు సుమారు వందమంది రక్తదానం చేశారు. పిన్నవయసులోనే తండ్రికి తగ్గ తనయుడుగా అందరి మన్ననలు పొంది, యువ నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో మృతి చెందడం అత్యంత బాధాకరమని పలువురు పేర్కొన్నారు. విష్ణు స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు యువసేన సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గూడెం విక్రం రెడ్డి, లక్ష్మణ్, గోపాల్, జంగారెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు