తిరుపతి జిల్లా, పాకాల మండలం, దామలచెరువు, మ్యాంగోనగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 11 మండీలు ప్రమాదవశాత్తు తగలబడి భారీ ఆస్థినష్టం జరిగినట్లు తెలుసుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్థానికులతో కలసి ద్విచక్ర వాహనంపై సంఘటన స్థలానికి చేరుకుని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను విచారించాలని పాకాల పోలీసులకు తెలిపారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వారి వివరాలు, ఎంత నష్టపోయారు అనే వివరాలు తెలపాలని అధికారులను కోరారు. అగ్ని ప్రమాదం లో నష్టపోయిన వారిని ఆదుకోవాలని కలెక్టర్ ను కోరారు నాని.