ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటి పాడు గ్రామంలో జరుగుతున్న పోలేరమ్మ తల్లి తిరునాళ్లలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి కి ప్రమాదం తృటిలో తప్పింది. ఎడ్ల ప్రదర్శనకు తీసుకువచ్చిన ఎడ్లను పరిశీలిస్తుండగా అవి మంత్రి వైపు దూకి .. దూసుకు వెళ్ళడంతో కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు. స్థానికులు అప్రమత్తం ఉండి మంత్రిని కాపాడడం వలన పెనుప్రమాదం తప్పింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.