జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో గ్రామదేవతల నల్ల పోచమ్మ ముత్యాలమ్మ బోనాలు ఆదివారం ఘనంగా బోనాల ఉత్సవాల సంబురాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రోజున గ్రామ దేవతలకు కల్లు సాకలతో పట్టు వస్త్రాలు , ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి ఆలయాన్నీ రంగులతో పాటు రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. స్థానిక నాయకులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి పలు కాలనీలు, ఆలయాల ఉత్సవమండలి ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.