పల్నాడు జిల్లా / కారంపూడి/ మిరియాల : గ్రామాలలో శాంతిభద్రతలకు విగతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కారంపూడి ఎస్.ఐ అమిర్ అన్నారు. ఆదివారం మండలంలోని మిరియాల గ్రామంలో పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పల్లెనిద్ర కార్యక్రమన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా గ్రామస్తులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎస్.ఐ అమిర్ మాట్లాడుతూ ఫ్యాక్షన్ గొడవలలో దూరి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఈ సందర్బంగా అయన గ్రామస్తులను కోరారు. శాంతిభద్రతల పరంగా ఎటువంటి సమస్యలు వచ్చిన ప్రజలకు పోలిస్ శాఖ అండగా ఉంటుందని పోలీసులు ప్రజలకు మధ్య సత్సంబంధాలు మెరుగుపడాలనే ఉద్దేశంతోనే ఉన్నత అధికారులు పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టడం జరిగిందని అయన అన్నారు. గొడవల వలన జరుగు నష్టాలు, సైబర్ క్రైమ్, చీటింగ్, దొంగతనాలు ఇతర నేరల పట్ల ఈ సందర్బంగా అయన ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలు శాంతిభద్రతల విషయంలో పోలీసులకు సహకరించాలని గ్రామంలో అలజడులు సృష్టించే వారు ఎవరైనా ఉంటే అటువంటి వారి వివరాలను పోలిస్ శాఖకు తెలియజేయాలని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామపెద్దలతో పాటు పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.