కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం సమీపంలో ఉన్న గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం స్టేజ్ 1 పంపు హౌస్ లో ఉన్న సామగ్రిని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. సుమారు 4,200 ఎకరాలకు సాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో రైతులు లబొ దిబో మంటున్నారు. స్టాటర్లు, బ్రేకర్లు, ఇన్ఫఫీలేటర్లు చెల్ల చెదారంగా పడేశారు. ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. రాజకీయ కక్ష సాధింపు కారణంగా ఎవరైన చేశార లేక దొంగలు చేశార అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.