మదనపల్లి :మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ భాదితులు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి క్యూ కడుతున్నారని, అనకొండ లాగా త్రవ్యేకొద్ది అక్రమాలు వస్తున్నాయని, సిఐడి అధికారులు పూర్తి స్దాయి విచారణ చేపట్టాలని టిడిపి రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం నిమ్మనపల్లి సర్కిల్ లోని తన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పెద్దిరెడ్డి బాధితు తమకు జరిగిన అన్యాయాన్ని పేజీల కొద్ది డాక్యుమెంట్లు పంపిస్తున్నారని వివరించారు. పీలేరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తల్లి పద్మావతమ్మ పేరు మీద అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిన విషయాన్ని తెలియజేశారు. పీలేరులో సర్వే నంబర్ 259/5 లో 1 ఎకరా 92 సెంట్లు క్రిష్ణారెడ్డి పేరు మీద రిజిస్టర్ అయిందని అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికార బలంతో ఆ రిజిస్టర్ వున్నా అక్రమంగా తన తల్లి పద్మావతమ్మ పేరు మీద చేయించుకుని, పక్కనే వున్న చెరువు ఆక్రమించి బిల్డింగ్ నిర్మాణం చేశారని ఆరోపించారు. దీనిపైన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వివరించి చర్యలు చేపట్టే విధంగా చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా మదనపల్లె ప్రాంతంలో పెద్దిరెడ్డి పీఏగా చలామణిలో ఉన్న శశికాంత్ ఎన్నో భూ బాగోతాలు వున్నాయని అన్నారు. ముఖ్యంగా మదనపల్లెలో ఓ పెట్రోల్ బంకు ఓనర్ కుమారుడితో శశికాంత్ సన్నిహితంగా ఉంటూ పెట్రోల్ బంకు ఓనర్ తోకలిసి డికెటి భూములలో లేఅవుట్లు వేసి పేదలను మోసం చేశారని దీనిపైన సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ బంకు ఓనర్ వేసిన అన్ని లేఅవుట్లలో డికెటిలు అధికంగా వున్నాయని ఆరోపించారు. శశికాంత్ ఒత్తిడితో మదనపల్లె ప్రభుత్వ బోధన ఆసుపత్రిలో అర్హత లేకపోయినా ఓ మహిళకు ప్రొఫెసర్ గా నియమించారని, దీనిపైన సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. పుంగనూరు నియోజకవర్గంలో శశికాంత్, మినిస్టర్ సర్వేయర్ గా పేరువున్న ప్రకాష్ వందలాది ఎకరాల భూములు గుర్తించి వాటిని పెద్దిరెడ్డి కుటుంబానికి ధారాదత్తం చేశారని, ప్రకాష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరింత సమాచారం తెలుస్తుందని అన్నారు. పెద్దిరెడ్డి కుటుంబ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.