తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టబడినటువంటి రుణమాఫీ 2024 లో భాగంగా రెండు లక్షల లోపు రుణాలు కలిగిన రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు విడుదల లో భాగంగా రెండో విడత లక్ష యాభై వేల లోపు పంట రుణం కలిగిన రైతులకు నిధుల విడుదల కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా హైదరాబాద్ నందు పంపిణీ కార్యక్రమం ప్రారంభించబడింది.
ఇందులో భాగంగా ఈ కార్యక్రమం సమీకృత కలెక్టర్ భవన సముదాయం మీటింగ్ హాల్ నందు రైతులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ రాజ్ కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో రైతుకు సరైన సమయంలో రుణమాఫీ చేయడం ద్వారా తన పెట్టుబడి ఖర్చులకు మరియు ఎరువులు పురుగుమందుల అవసరాలకు రుణమాఫీ నిధులు పనికి వస్తాయని క్షేత్రస్థాయిలోని రైతులను రుణ విముక్తి చేయాలనే సదుద్దేశంతో ప్రభుత్వం కృత నిశ్చయంతో రుణమాఫీ నిధులను విడుదల చేయడం జరిగిందని రెండు లక్షల లోపు రుణాలు కలిగిన రైతులకు కూడా త్వరలోనే నిధులు విడుదల చేస్తాయని ఇప్పటివరకు మొదటి విడతలో భాగంగా జిల్లాలోని 47,968 మంది రైతులకు 238.81 కోట్లు నిధులు జమ కావడం జరిగిందని , ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిల్లాలోని 21,517 మంది రైతులకు 202.98 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందని, రెండు విడతల్లో జిల్లా వ్యాప్తంగా 69,495 మంది రైతుల కు 441.79 కోట్ల నిధులు జమ కావడం జరిగిందని తెలిపారు.
రుణమాఫీకి సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్న ఫిర్యాదులున్న క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తీర్ణాధికారి మండల స్థాయిలో మండల వ్యవసాయ అధికారి జిల్లా స్థాయిలో జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయాల్లో ప్రత్యేక ఫిర్యాదు విభాగాలు ఏర్పాటు చేయడమైందని అర్హత కలిగిన ప్రతి రైతుకు రుణమాఫీ అందే విధంగా పటిష్ట చర్యలు చేపడుతున్నామని రైతులు ఎలాంటి అపోహలకు పోకుండా తమకు రుణమాఫీ సంబంధించిన సందేహాలను వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలని అదేవిధంగా రుణమాఫీ జరిగిన రైతుల ఖాతాలను రెన్యువల్ చేసి రైతులకు కావాల్సిన డబ్బులను వెంటనే విడుదల చేయాలని బ్యాంకర్లను కోరారు క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉంటూ రైతులకు రుణమాఫీకి సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తూ రుణమాఫీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు మరియు బ్యాంకు అధికారులకు మధ్య సమన్వయపరదాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశిందారు.
ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ జిల్లా సహకార శాఖ అధికారి కరుణ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మూర్తి , జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక సహకార సంఘం చైర్మన్లు అదనపు వ్యవసాయ సహాయ సంచలకులు మండల వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ప్రాథమిక సహకార సంఘం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.