Gitam :బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్స్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్ ఏసీ) సౌజన్యంతో, హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం, డెంగ్యూ ఫీవర్ కు సమర్ధవంతమైన చికిత్సను అందించే లక్ష్యంతో చేపడుతున్న పరిశోధనా ప్రాజెక్టులో జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
డెంగ్యూకి వ్యతిరేకంగా కొత్త చికిత్సా విధానాలకు మార్గం సుగమం చేసే వినూత్న పరిశోధనపై
దృష్టి, పారించేందుకు గాను మెడిసినల్ కెమిస్ట్రీ రంగంలో ఔత్సాహిక పరిశోధకులకు ఇదో మంచి అవకాశంగా ప్రధాన పరిశోధకుడు డాక్టర్ రాంబాబు గుండ్ల మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ప్రథమ శ్రేణిలో ఆర్గానిక్ లేదా మెడిసినల్ కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ (ఎమ్మెస్సీ) చేసినవారు దరఖాస్తు చేయొచ్చన్నారు. అయితే సీఎస్ ఐఆర్-యూజీసీ-నెట్, గేట్, డీబీటీ లేదా ఐసీఎంఆర్ వంటి జాతీయ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
జేఆర్ఎఫ్ ఎంపికైన అభ్యర్థికి (నెట్/గేట్ అర్హులకు) నెలకు రూ.31 నేలతో పాటు ఇంటి అద్దె అలవెన్సు, అర్హత సాధించని వారికి నెలకు రూ.25 వేలతో పాటు ఇంటి అద్దె చెల్లిస్తామని, గరిష్ఠ వయో సరిమితి 35 ఏళ్లగా డాక్టర్ రాంబాబు సృష్టీకరించారు.
అర్హత గల అభ్యర్థులు వారు విద్యా ధ్రువీకరణ పత్రాలు, అనుభవ లేఖలు, కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)తో పాటు వారి బయోడేబాను డాక్టర్ రాంబాబు గుండ్ల, ప్రొఫెసర్, రసాయన శాస్త్ర విభాగం, గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, హెదరాబాద్ కు ఓ వారం రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాల కోసం 98 49 86 99 330 సంప్రదించాలని లేదా rgundla @gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.
ఇంటర్వ్యూకు అర్హత సాధించిన వారికి ఈ-మెయిల్ ద్వారా సమాచారం తెలియజేస్తామని, అయితే ఇంటర్వ్యూకు హాజరు కావడానికి ఎటువంటి ప్రయాణ భత్యం (టీఏ) లేదా రోజువారీ భత్యం (డీఏ) చెల్లించబోమని డాక్టర్ రాంబాబు పేర్కొన్నారు.