ప్రకాశం జిల్లా / చీమకుర్తి : పట్టణంలో వాహనచోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. వాహన దారులు ఇష్టానుసారంగా రాకపోకలు సాగిస్తున్నారు.పట్టణం అభివృద్ధి చెందుతుండడంతో పాటు పట్టణ జనాభాకు తోడు వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో పట్టణ ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ సమస్య జటిలంగా మారింది. కావున ఈరోజు డిఎస్పి కిషోర్ బాబు పరిశీలించారు, సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై వెంకటేశ్వర్లు తో కలిసి పలు ప్రాంతాలు పరిశీలించారు. డిఎస్పీ ట్రాఫిక్ ను నియంత్రించే సూచనలు చేశారు.