మెదక్ జిల్లా లోని చేగుంట చిన్న శంకరంపేట పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు . ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, డయల్ 100 కాల్స్ కు వెంటనే స్పందించాలన్నారు. అనంతరం స్టేషన్లోని రికార్డ్స్ ను పరిశీలించి కేసుల నమోదు వాటి యొక్క స్థితి గతులను తెలుసుకుని పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిఎస్పీ . వెంకట రెడ్డి , రామాయంపేట సిఐ వెంకట రాజా గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.