ప్రకాశం జిల్లా / చీమకుర్తి : చీమకుర్తి మండలం కె.వి పాలెం గ్రామంలో నల్లూరి ఫౌండేషన్, కిమ్స్ హాస్పిటల్ మరియు బిగ్ టివి వారి సౌజన్యంతో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యేగా బిఎన్ విజయకుమార్ చేతులమీదుగా ప్రారంభించారు. ఎముకలు, గర్భిణులు, కళ్లు, చిన్న పిల్లల సమస్యలు, జనరల్ మెడిసిన్ సమస్యలకు చికిత్స అందించారు. సుమారు వెయ్యి మంది వైద్య సేవలకొరకు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి వైద్య శిబిరాలు మరెన్నో నిర్వహించాలని కోరారు, అలాగే చిత వైద్య శిబిరం లో వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య బృదం, బిగ్ టివి జర్నలిస్టులు, చీమకుర్తి పట్టణ టిడిపి , జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు