contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నెల్లూరు గ్రామీణ పోలీసు ఉపవిభాగ సంవేద్యీకరణ శిక్షణా కార్యక్రమము

 ప్రస్తుతం  రాష్ట్రము లో నెలకొని వున్న పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్ర డి జి పి శ్రీ డి. గౌతమ్ సవాంగ్ గారి ఆదేశాల మేరకు వివిధ స్థాయిలలో పోలీస్ విభాగంలో పనిచేస్తున్న వారికి అనవసర బల ప్రయోగం, బలహీన వర్గాల వారికి పోలీసు విభాగం పై నమ్మకం కలిగించటం, పిర్యాదు చేయుటకు వచ్చిన  స్త్రీల పట్ల  స్నేహపూర్వక వాతావరణం కల్పించటం, నిందితుడు మరియు బాధితుడు పట్ల   పోలీసుల ప్రవర్తన శైలిలో మానసిక మార్పు తీసుకురావటం, దిశా చట్టం మీద నిశాతులైన వారిచే శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమము కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు రురల్ డిఎస్పీ వై.హరినాథ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాములో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి , రిసోర్స్ పర్సన్ గా పాల్గొని పోలీసులు మానహక్కుల ఉల్లంఘన, అవినీతి రహితమైన పోలీసు వ్యవస్థను నిర్మించటం వంటి అంశాల మీద విపులంగా చర్చించారు.  ఇటువంటి అవగాహన సదస్సుల వలన  పోలీసుల పై వస్తున్న విమర్శలను మరియు తమ పనితీరును సమీక్షించుకొనే 

అవకాశం వస్తుందని అన్నారు. ఇది ఒక శుభ పరిణామమని తద్వారా ఒక మార్పుకి శ్రీకారం చుట్టటానికి అవకాశం వస్తుందని అన్నారు. పోలీసు వ్యవస్థ అనేది చట్ట పరిరక్షణ కంకణబద్దమైనదని, ప్రభుత్వ, ప్రైవేట్  ఆస్తుల పరిరక్షణ కల్పించటం వారి బాధ్యత అని అన్నారు. ఈ విధినిర్వహణలో, కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి అనివార్యమవుతుందని, తద్వారా పోలీసు వ్యవస్థ విమర్శల పాలవుతుందని అన్నారు.  అలాగే విధినిర్వహణలో ఎదురయ్యే, రాజకీయ, మరియు ఇతర వర్గాల నుంచి ఎదురయ్యే ఒత్తిడులను ఎదుర్కొని విధులను సమర్ధవంతముగా  నిర్వహించటానికి యోగా ధ్యానం వంటివి తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కోరారు.  ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏ ఎస్పీ  శ్రీమతి పి. వెంకట రత్నం  పాల్గొని Empathy మరియు Sympathy రెండూ ప్రస్తుత పరిస్థితులలో  పోలీసులకు ఉండవలసిన  ముఖ్యలక్షణాలని అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లను భవిష్యత్తులో రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళితుల హక్కుల కోసం పనిచేస్తున్న స్వచ్చింద సంస్థ నిర్వాహకులు మదన్ మిశ్ర , స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ నిర్వాకులు డా. సురేష్ బాబు , వి ఎస్ యు కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్, బుచ్చి సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు  . చివరిగా కరోనా విపత్కర పరిస్థుతులలో ఉత్తమ సేవలందించిన  ఐదుగురు పోలీసు వారికి హెడ్  కానిస్టేబుల్స్ , భాస్కర్, మునికృష్ణ, మస్తానయ్య, ఇస్మాయిల్, సీతారామయ్యలను    సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకటాచలం రురల్ సిఐ కె. రామకృష్ణ, ఎస్ఐ ఎస్కె కరీముల్లా,  నెల్లూరు రురల్ పిఎస్ సి ఐ శ్రీనివాసుల రెడ్డి, కృష్ణపట్నం పోస్ట్  సిఐ ఎస్ కె. ఖాజావళీ, NSS సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, పి ఆర్ ఓ డా. నీల మణికంఠ  మరియు సుమారు 100 మంది పోలీసు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :