కరీంనగర్ జిల్లా: చలో హైదరాబాద్ సచివాలయం ముట్టడి కార్యక్రమానికి శాంతియుత ధర్నా కార్యక్రమానికి వెళ్తుండగా అక్రమంగా గన్నేరువరం పోలీసులు మండలంలో ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది. అరెస్టు చేసిన వారిలో తాజా మాజీ సర్పంచ్ లు గంప మల్లేశ్వరి, పి.లక్ష్మి,తీగల మోహన్ రెడ్డి,గంప వెంకన్న లను అరెస్ట్ చేశారు. ముఖ్యంగా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించాలి అనే ఒక నినాదంతో ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపు ఇవ్వడంతో దాన్లో భాగంగా ధర్నా కార్యక్రమానికి వెళుతుండగా అన్యాయంగా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.శాంతియుతంగా ధర్నా చేసుకోవచ్చు అని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూనే అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి ఆ తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్ కు వెళ్లాలని డిమాండ్ చేశారు.