- రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని చూస్తే తాటతీస్తాం
- ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కూడా పనికి రారు అంటూ వైసీపీకి బుద్ధి చెప్పారు
- మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి
పల్నాడు జిల్లా / మాచెర్ల : ప్రజా సమస్యల పట్ల వైసిపికి చిత్తశుద్ధి లేదని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. గురువారం మాచర్ల పట్టణంలోని 26 వార్డు సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నెహ్రు నగర్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించకుండా ప్రజాస్వామ్యం హత్యకు గురైంది అంటూ స్పీకర్ పోడియం వద్ద హడావుడి చేసి వెళ్ళటం వారి చేతకానిత నాకు నిదర్శనం అన్నారు అసెంబ్లీలో వారి హయాంలో జరిగిన అవినీతి అక్రమాలకు అధికారపక్షం అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక పలాయనం చిత్తగించారని అన్నారు. 11 మందిని గెలిపించిన ఆరుగురు గెలిపించిన రాజకీయ పార్టీకి బాధ్యత ఉంటుందని ప్రతిపక్ష హోదా ఇస్తేనే బాధ్యత కాదని ఆయన అన్నారు. 36 మంది చనిపోయారంటూ దేశ రాజధాని ఢిల్లీలో నానా యాగి చేసిన మాజీ ముఖ్యమంత్రి తమ హయాంలో జరిగిన విధ్వంసకాండకం ఏనాడైనా తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు వచ్చాడా అని ప్రశ్నించారు. వరదలు వచ్చినా ఎవరైనా చనిపోయిన తన చిక్కటి చిరునవ్వుతోనే అభివాదం చేయటం పైశాచిక ఆనందమా అంటూ ప్రజల చర్చించుకుంటున్నారని అన్నారు. శవాల మీద రాజకీయం చేయటం వైసీపీకి అలవాటని అన్నారు. తుని లో రైలు దహనం వివేకానంద రెడ్డి హత్య కోడి కత్తి కోస్తా ఆంధ్రాలో అల్లర్లు ఇవన్నీ వైసిపి రాజకీయ వికృత క్రీడలో భాగాలని అన్నారు. నియోజకవర్గాల వారీగా కొన్ని సోషల్ మీడియాలను క్రియేట్ చేసుకుని ప్రభుత్వంపై విష ప్రచారాలు నిర్వహించి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అందుకు నియోజకవర్గాలుగా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారని ప్రజల పట్ల ఏమాత్రం అభిమానం ఉన్న అభివృద్ధికి ఆ డబ్బులు ఖర్చు చేయాలన్నారు విధ్వంసాలు సృష్టించాలని చూస్తే తాటతీస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న వైసీపీ నైజాన్ని ప్రజలు గ్రహించారన్నారు. వైసిపి రాక్షస క్రీడల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఉందని అందుకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం కాదు అభివృద్ధిని కొత్త సిరతో కొత్త చరిత్రను ఎన్డీఏ ప్రభుత్వం లికిస్తుందని ఆయన అన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదాకు కూడా వైసిపి పనికిరాదని విస్పష్టంగా తీర్పు ఇచ్చారని ఆ తీర్పును కాదని తనకు ప్రతిపక్ష హోదా కావాలని అడగటం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. గోదావరి జిల్లాలో వరదలు సంభవిస్తే మంత్రులు ఎమ్మెల్యేలు ఏసీ గదులకు పరిమితం కాకుండా అహర్నిశలు ఆ ప్రాంత ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో మునిగిపోయారని ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అంటే పనిచేయటమని మా నాయకుడు చెప్పారని మీలాగా ప్రభుత్వము ఉంటే దోచుకోవటం కాదని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించేందుకు వైసిపి నాయకులు కుట్రలు కొనుతున్నారని అందుకు ఉదాహరణ వినుకొండ సంఘటన అని అన్నారు. పరామర్శించేందుకు వచ్చిన శ్రేణులు టిడిపి ఫ్లెక్సీలను చించి వేయటం రెచ్చగొట్టే విధంగా శ్రేణులను ఉసిగొల్పటం ఇందులో భాగమన్నారు. వినుకొండలో ఇద్దరు రౌడీ షీటర్లు పరస్పరం దాడులు చేసుకుని ఒకరు చనిపోతే వారిని పరామర్శించడానికి వెళ్ళటం ప్రజాస్వామ్య వ్యవస్థలో దేని ద్వారా అయితే ప్రజలు ఎన్నుకుంటారు ఆ వ్యవస్థలను అపహాస్యం చేసిన చేసిన వ్యక్తిని పరామర్శించేందుకు 25 లక్షలు ఖర్చులు చేసిన ఈ రెండు సంఘటనలతో జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం విలువ ఉందో అర్థమవుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్యుడు అని అన్నారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే పత్రికా విలేకరులు ఏర్పాటుచేసిన పుస్తకాలు బ్యాగులు పంపిణీ నిర్వహించారు కార్యక్రమంలో కొమ్మెర దుర్గారావు మదర్ సాహెబ్ కుర్రి శివారెడ్డి మున్నా రాంబాబు యాదవ్ మదిగపు పెద్ద వెంకటరామిరెడ్డి ఎనుముల కేశవరెడ్డి యాగంటి మల్లికార్జునరావు శ్రీరామ్ మూర్తి గాజుల గణేష్ షేక్ జానీ రసూల గుత్తికొండ సత్యనారాయణ రెడ్డి శాంతి శివపార్వతి మధుబాబు వలి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు విద్యార్థులు పాల్గొన్నారు.