తిరుపతి జిల్లా / చంద్రగిరి : చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం ఎన్.ఆర్ కమ్మపల్లి గ్రామస్తులు పులివర్తి నాని భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఆర్ సి పురంలోని గ్రామ దేవత శ్రీ మూలస్థానమ్మ కు మొక్కుకున్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో పులివర్తి నాని ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందారు. గ్రామస్తులంతా కలిసి శ్రీ మూలస్థానమ్మ వారికి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు పులివర్తి నాని ఎన్.ఆర్ కమ్మపల్లికి చేరుకున్నారు. మండల పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే కి సాదరంగా ఆహ్వానం పలికారు. మహిళలు మంగళహారతులతో, యువత టపాకాయలు కాలుస్తూడ్రమ్స్ వాయిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ప్రతి ఒక్కరిని పేరుపేరునా అప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ నా గెలుపుకి కృషి చేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదేవిధంగా అందరం కలిసి కట్టుగా గ్రామ అభివృద్ధికి కృషి చేద్దామని ఎమ్మెల్యే తెలిపారు.