పాఠశాలల్లో కమిటీ ఎన్నికల కొరకు నోటిఫికన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని తిరుపతి జిల్లా పాకాల మండలం విద్యా శాఖాధికారి బాబ్జి అన్నారు.ఆయన శుక్రవారం స్థానిక మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 8 వ తేదీ పాఠశాలలో యాజమాన్య కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ,కమిటీ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుందని అన్నారు.దీని కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతి తరగతి నందు ముగ్గురు సభ్యులను ఎన్నికోవాలని పేర్కొన్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరు మహిళలు, ఒక్కరు పురుషుడు ఉండేటట్లు చూడాలన్నారు.ఆ విధంగా ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం 5 తరగతులు ఉంటాయి కాబట్టి మొత్తం 15 మంది సభ్యులు ఉంటారని అన్నారు.ఉన్నత పాఠశాలలో కూడా 5 తరగతులు ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా 15 మంది సభ్యులు ఉంటారని అన్నారు.ఈ 15 మంది కలసి ఒక్కరిని చైర్మన్ గా,ఒక్కరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకుంటారని పేర్కొన్నారు. చైర్మన్ పురుషుడు అయితే వైస్ చైర్మన్ స్త్రీ ఉంటుందని అన్నారు.ఎన్నికలను 8 వ తేదీ 7 గంటల నుండి మధ్యాహ్నం ఒక గంట వరకు జరపాలని అన్నారు.ఈ 15 మందిని ఎన్నుకున్న తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మొదటి కమిటీ సమావేశం నిర్వహించాలని కోరారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓటర్ల జాబితాను పాఠశాల నోటీస్ బోర్డ్ నందు ప్రదర్షించాలని కోరారు.కాబట్టి ఎన్నికలను సజావుగా జరిపించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్స్ శ్రీధర్ రెడ్డి,గణేష్ ,సి.అరి.పి.లు ,ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.