అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్‌టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి స్వీకరించిన వినతులన్నింటిని పరిష్కరించడమే మా లక్ష్యం అని అన్నారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు అందాయని తెలిపారు.
రెవెన్యూ సమస్యలకు కారణమైన అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని తెలిపారు. రికార్డులు తారుమారు చేశార్న సీఎం.. ప్రతీ మండలంలోనూ భూకుంభకోణం జరిగిందన్నారు.