ములుగు జిల్లా / ఏటూరునాగారం : జిల్లాలో ఐఐటి , ఎన్ఐటి లో సీటు పొందిన గిరిజన నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చెక్కులను ఏటూరునాగారం లోని స్థానిక ఐటిడిఎ గెస్ట్ హౌస్ లో రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అందజేశారు. మంత్రి మాట్లాడుతూ పేదరికాన్ని జాయించాలంటే చదువు ఒక్కటే మార్గమని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతాతస్థాయికి చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఐటిడిఏ పి.ఓ. చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ శ్రీజ, అదనపు కలెక్టర్ మహేందర్, ఆర్డీఓ సత్యా పాల్ రెడ్డి పాల్గొన్నారు .