పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఎన్నికలు ముగిసి రెండు నెలలు అవుతున్న వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో వివాదాస్పద వ్యక్తులతో పాటు తటస్థంగా ఉన్న రైతు కుటుంబాలు కూడా ఊర్లు వదిలి పెట్టి పోవాల్సిన పరిస్థితులు నెలకొంది. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితులు చక్కదిద్దేందుకు,మధ్యవర్తిత్వంగా ఎవరు ముందుకు రాకపోవడంతో పిన్నెల్లో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. కొద్ది రోజుల క్రితం జిల్లా ఎస్పీ స్వయాన పిన్నెల్లి గ్రామాన్ని పరిశీలించిన తర్వాత కూడా అదే రోజు గ్రామంలో గొడవ జరగడంతో, మాచవరం కూటమి పార్టీ సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే యరపతినేని దాడులకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని దయచేసి వివాదాలకు దూరంగా ఉండాలని, పార్టీ నాయకులు కార్యకర్తలు సమయమనం పాటించాలని సమావేశంలో ప్రసంగించడం జరిగింది. సాధ్యమైనంత త్వరగా పిన్నెల్లి గ్రామంలో శాంతియుత పరిస్థితులు నెలకొల్పే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు అభ్యర్థిస్తున్నారు. పిన్నెల్లిలో వ్యవసాయ కుటుంబలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సాగును సకాలంలో చేపట్టే విధంగా నాయకులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ ఆధారిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. లేకపోతే వేల ఎకరాలు బీడు భూములుగా మారె పరిస్థితిలు ఉంటాయని స్థానికులు పేర్కొన్నారు.