తిరుపతి జిల్లా, పాకాల మండల పరిధిలో వ్వయసాయానికి అనుకూలంగా ఉన్న ప్రభుత్వ ఫారెస్ట్, బంజార భూములను భూమిలేని క్యాన్సర్ పేదలకు పంచాలని గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో సోమవారం పాకాల మండలంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో గానుగపెంట, పెద్దరామాపురం, మద్దినాయనపల్లి, పెద్దగోర్పాడు తదితర గ్రామ పంచాయితీలలోని ప్రజలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ పల్లెల్లో వందలాది మంది భూమిలేని పేదలు రోజు కూలీలుగా జీవనం సాగిస్తున్నారని. ఎక్కువశాతం మందికి వ్యవసాయం చేసుకోవడానికి సెంటు భూమి కూడా లేకపోవడం వల్ల తమ జీవనోపాదికోసం కూలీ పనులు చేసుకుంటూ వచ్చే చాలీ చాలని కూలీలలతో దుర్భరజీవితం గడుపుతున్నామన్నారు. మరో ప్రక్క వ్యవసాయానికి అనుకూలంగా ఈ పరిసర ప్రాంతాల్లో వందలాది ఎకరాలు ఫారెస్ట్ బంజర భూములు బీడుగా ఉన్నాయని, ఈ భూముల వలన ప్రభుత్వానికి పైసా కూడా ఆదాయం లేదన్నారు. ఇలాంటి భూములను భూమిలేని పేదలకు పంచి వ్యవసాయానికి కావాలసిన సౌకర్యాలు కల్పించినట్లయితే గ్రామీణ పేదల జీవనోపాధి అభివృద్ధి అవుతుందని గ్రామీణ పేదల సంఘం తరుపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.