contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జోరుగా సాగుతున్న కారంపూడి స్కూల్ HM కలెక్షన్స్ ..

  • విద్యార్థుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న హై స్కూల్ హెచ్ఎం
  • సంవత్సరానికి సుమారు మూడు నుండి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేస్తున్న హెచ్ఎం
  • విద్యా కమిటీ, పేరెంట్స్ కమిటీ అనుమతితోనే వసూలు చేశాం అంటున్న హెచ్ఎం
  • సంబంధం లేదంటున్న విద్యా కమిటీ చైర్మన్ ఆతుకూరి గోపి

 

పల్నాడు/ జిల్లా కారంపూడి : మండల కేంద్రమైన కారంపూడి లోని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కూలు మెయింటినెన్స్ పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుండి సుమారు 400 రూపాయలు వసూలు చేస్తున్న అనంత శివ.  డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో పాఠశాల HM అనంత శివని వివరణ కోరగా మా స్కూలు మా ఇష్టం మీరెవరు మమ్మల్ని అడగడానికి అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ దురుసుగా వ్యవహరించారు. వసూలు చేస్తున్నట్లు పై అధికారులు అనుమతి ఉందని వివరణ కోరగా పై అధికారులు అనుమతి అవసరం లేదు నా స్కూలుకి నేనే కలెక్టర్ నేనే బాస్ నంటూ మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉంది. తను వసూలు చేస్తున్న మాట వాస్తవమేనని దానిని స్కూల్ మరమ్మత్తులకు ఖర్చు పెడుతున్నానని అన్నారు. ప్రభుత్వం నుండి జిల్లా పరిషత్ హై స్కూల్ కు నిధులు ఒక్క రూపాయి కూడా రాదని అన్నారు. పాఠశాలలోని సమస్యలపై డీఈఓ దృష్టికి తీసుకువెళ్లారా అని అడగ్గా గతంలో అనేక సమస్యలు తీసుకెళ్లాం వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులకు కానీ ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూనే తాను వసూలు చేస్తున్నది సక్రమమే అంటూ తను చెప్పిందే వేదంలాగా చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఆర్థిక పరిస్థితి బాగాలేక హెచ్ఎం అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఆ విద్యార్థులపై దురుసుగా ప్రవర్తిస్తూ పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు.. ప్రైవేట్ పాఠశాలలకు పంపలేక గవర్నమెంట్ స్కూల్ కి పిల్లలు చదువుకోవడానికి వెళుతుంటే ఇలాంటి అక్రమ వసూలు చేస్తూ స్కూలు ఖర్చుల పేరుతో లక్షల వసూలు చేస్తున్న హెచ్ఎం అనంత శివ విద్యార్థుల తల్లిదండ్రులు కొంతమంది అడగ్గా తల్లిదండ్రుల వద్ద సానుకూలంగా సమాధానం చెబుతూ అనంతరం విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వాలు విద్యపై అనేక పథకాలు ఏర్పాటు చేస్తూ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని అనేక నిధులు విడుదల చేస్తుంటే కారంపూడి ప్రధానోపాధ్యాయులు అనంత శివ లాంటి వారి వల్ల ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది. అక్రమ వసులపై ప్రశ్నించిన విలేకరులపై మీరెవరు నన్ను ప్రశ్నించడానికి మీకు చెప్పాల్సిన అవసరం లేదు నా స్కూల్లోనే నా ఇష్టం. జిల్లా స్థాయి అధికారులకు మాత్రమే నేను సమాధానం చెప్తాను. గతంలో అనేక సమస్యలపై జిల్లా స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చిన వారు ఏమి చేయలేకపోయారని వారికి చెప్పిన ఉపయోగం లేదు అందుకే నా స్కూలుకి నేనే బాస్ నన్ను ఎవడు ఏమీ చేయలేడు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి నా పై స్థాయి అధికారులు కానీ కలెక్టర్, గ్రామస్తులు గాని నన్ను ఎవడు ఏమి చేయలేడు అంటూ అసభ్యకరంగా మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు అనంత శివ తన దర్పం ప్రదర్శించారు. ఇప్పటికైనా పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు కలగజేసుకొని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్ పై దృష్టి సారించి విద్యార్థులు పడుతున్న పలు సమస్యలను పరిష్కరించి హెచ్ఎం అనంతశివపై చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యార్థులు, తల్లిదండ్రులు , ప్రజలు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :