పల్నాడు జిల్లా కారంపూడి : నాటు సారా బట్టిలపై మెరుపుదాడులు నిర్వహించినట్లు కారంపూడి ఎస్సై అమీర్ , సెబ్ సీఐ సూర్యనారాయణ తెలిపారు. వివరాల్లోకి వెళితే పోలీస్ మరియు సెబ్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారని, పక్కా సమాచారం మేరుకు కారంపూడి గ్రామ శివారు లో గల అటవీ ప్రాంతము లో దాడిచేసి నాటు సారా బట్టి ని ద్వంశం చేసి, రెండు వందల లీటర్ల బెల్లం ఊట ను నాశనం చేసి, ఆరు లీటర్ల నాటు సారా ను స్వాదినం చేసుకున్నారు. సారాయిని తయారు చేస్తున్న వల్లేపు కొండయ్య, బానావత్ రామంజి నాయక్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించనున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ దాడుల్లో పిడుగురాళ్ళ సెబ్ ఇనస్పెక్టర్ సూర్యనారాయణ మరియు వారి సిబ్బంది , కారంపూడి హెడ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు