తెలంగాణ డ్రైవర్లూ… ఏపీ వారిపై మానవత్వం చూపండని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాజధాని గడువు తీరగానే హైదరాబాద్‌లో ఉండకూడదంటూ తెలంగాణవారు అడ్డుకుంటున్నట్లుగా తెలిసిందని, ఇది సరికాదన్నారు. ఇది రెండువేల కుటుంబాలకు సంబంధించిన అంశమన్నారు. ఏపీలో రాజధాని పనులు ప్రారంభం కాగానే ఇక్కడి డ్రైవర్లకు ఉపాధి మెరుగవుతుందని ఆకాంక్షించారు. అప్పటి వరకు సాటి ఏపీ డ్రైవర్లపై మానవతా దృక్పథంతో చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విషయం పై ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ ఘాటుగా స్పందించారు. ఆంధ్రా డ్రైవర్లు తెలంగాణాలో బ్రతకడం పై తెలంగాణ బిడ్డలు ఎవరిని ఏమనరని .. కానీ ఎపి నుండి పొట్టచేతపట్టుకొని బ్రతకడానికి వచ్చినవారు కలిసిమెలిసి బ్రతకాలి కానీ .. అడుగడుగున తెలంగాణ బిడ్డలను అణచివేస్తూ .. గ్రూపులుగా ఏర్పడి తెలంగాణ బిడ్డలకు అవకాశాలు రాకుండా కడుపు పై కొడుతున్నారు. ఇది మీకు న్యాయంగా అనిపిస్తుందా ? .. తెలంగాణ బిడ్డల పై ఆరోపణలతో మీ ఆంధ్రా డ్రైవర్లు ఫిర్యాదు చేయగానే స్పందించారు .. మరి మా బిడ్డల కడుపులు కొడుతున్న మీ ఆంధ్రా వాళ్ళని ఏమనాలి ? మీరే చెప్పాలి ? న్యాయం అనేది మీకేనా ? మాకు న్యాయం లేదా ? తెలంగాణ బిడ్డలు ఆకలితో వచ్చిన వారికి కడుపునిండా అన్నం పెడతారే తప్పా .. కడుపు పై కొట్టరు .. ఇది మీరు గమనించాలి…
తెలంగాణ బిడ్డలను సినీ , టీవీ రంగంలో అణచివేస్తున్న విధానం :
తెలంగాణాలో ఆంధ్రా పెత్తందారులు సినిమా , టీవీ అస్సోసియేషన్లు పెట్టి అక్రమ వసూళ్ల దందా నడుపుతున్నారు. కొత్తగా వచ్చే కళాకారులను పని చేయనివ్వకుండా అడ్డుకుంటూ, అస్సోసియేషన్ కార్డు ఉంటేనే పని చేసుకోవాలి లేదంటే వీలులేదని దౌర్జన్యాలకు పాలుపడుతున్నారు. తెలంగాణ కార్మికుల వేతనాలు కూడా అక్రమంగా వసూల్ చేసుకొని నేటికీ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ఆంధ్రా పెత్తందారుల చేతిలో నేటికీ తెలంగాణ సినీ మరియు టీవీ కార్మికులు నలిగిపోతున్నారు. అడుగడుగునా అణచివేయబడుతున్నారు. నేటి కి విభజన చట్టం అమలు కాలేదు. తెలంగాణ సినీ, టీవీ కార్మిక సంఘాలు చెల్లవు అంటారు, ఫెడరేషన్ ఫేక్ అంటారు , ఛాంబర్ లేదంటారు. తెలంగాణ కార్మిక సంఘాలలో ఉంటె కడుపు పై కొడతారు. తెలంగాణాలో ఉన్న ఆంధ్రా సినీ కార్మిక సంఘాలు తెలంగాణ సినీ కార్మిక సంఘాలు చెల్లవంటూ ప్రచారాలు చేస్తున్నారు. ఆంధ్రా సినీ కార్మిక సంఘాల ఆగడాలకు అంతులేదు. కలెక్షన్లు, మోసాలు, దందాలు పట్టించుకునే అధికారి గాని, నాయకులు గాని లేరు. గత ప్రభుత్వం తెలంగాణ సినీ కార్మికుల సమస్యల పై పట్టనట్టు వ్యవహరించింది. కనీసం సియం రేవంత్ రెడ్డి తెలంగాణ బిడ్డల సమస్యల పై స్పందిస్తారని ఆశించారు. కానీ ఆంధ్రా సినీ పెత్తందారులకు ఆహ్వానాలు, అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ తెలంగాణ సినీ కార్మికుల సమస్యల పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
తెలంగాణ భాషను వెక్కిరిస్తారు, యాసను వెక్కిరిస్తారు. తెలంగాణ స్లాంగ్ ఉన్న క్యారెక్టర్ కి ఆంద్రోళ్ళ చేత డబ్బింగ్ చెప్పిస్తారు. అంటే అణచివేత ఎక్కడుంది ? మనకి కనబడేది ఒకటి చేస్తున్నది మరొకటి ఎవరు గమనించాలి ? ఎవరు తెలంగాణ బిడ్డల ఆర్తనాధాలు వినేది ! పని చేయించుకుని కార్మికుల వేతనాలు ఇవ్వరు. శ్రమ దోపిడీ చేస్తున్నారు. అడిగితె రౌడీ షీటర్స్ తో బెదిరింపులు లేదా అక్రమ కేసులు పెట్టి పోలీసుల చేత మానసిక వేదనకు గురిచేస్తున్నారు. అంటే డబ్బుతో పోలీసులను, రౌడీ షీటర్స్ ను కొంటున్నారా ? లేక ఏంటి ? సుమారుగా 40 ఏళ్ళు ఆంధ్రా సినీ పెత్తందారుల చేతిలో తెలంగాణ బిడ్డలు అడుగడుగునా అణచివేయబడుతున్నారు.
వీలయితే తెలంగాణ బిడ్డల అణచివేత పై కూడా స్పందిస్తే బాగుంటుందని, ఇకనైనా వాస్తవాలు తెలుసుకొని మీరు స్పందించాలని ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని వి. సుధాకర్ కోరారు.
తెలంగాణ డ్రైవర్లూ !… ఏపీ డ్రైవర్ల పై కాస్త మానవత్వం చూపండి: పవన్ కల్యాణ్ విజ్ఞప్తి
సినీ, టీవీ పరిశ్రమలో అరాచకాలు మితిమీరిపోతున్నాయి : వి.సుధాకర్